Wednesday, 23 January 2013

[YSR ] 'జగన్ పై కాంగ్రెస్ ది కక్ష సాధింపు:నల్లమిల్లి శేషారెడ్డి


వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తోందని అధికార పార్టీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి పరోక్షంగా ఒప్పుకొన్నారు. మాజీ మంత్రి శంకర్రావు 26 జీవోలపై పిటిషన్ వేసినప్పుడు అఫిడవిట్ దాఖలు చేయమని హైకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తప్పేనని ఆయన సాక్షి హెడ్‌లైన్‌షోలో వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీది కుట్ర అనడానికి శేషారెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ అంశంతో సీబీఐ కూడా ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తోందనేది తేలిపోయిందని సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.