[YSR ] 'సహకార ఎన్నికల్లోనూ కుమ్మక్కు'
కాంగ్రెస్-టీడీపీలు
సహకార ఎన్నికల్లోనూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ ఆర్ సీపీ
మద్దతుదారులు గెలవనివ్వకుండా కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓటర్ల
నమోదులో భారీ అక్రమాలకు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని శ్రీకాంత్
రెడ్డి డిమాండ్ చేశారు.
నిజాయితీ ఉంటే తహసీల్దార్ స్థాయిలో ఓటర్ల పరిశీలన చేయించాలని ఆయన అన్నారు.
అర్హులకు ఓటు హక్కు కల్పించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.