సహకార
సంఘాల ఎన్నికలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్ష
నిర్వహించనుంది. సమావేశాల వివరాలను పార్టీ గురువారం విడుదల చేసింది. 11వ
తేదీ(శుక్రవారం) విశాఖ, నెల్లూరు, రంగారెడ్డి జిల్లాలు, 12వ తేదీ(శనివారం)
కర్నూలు, ఖమ్మం, చిత్తూరు, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, 16వ
తేదీ(బుధవారం) ప్రకాశం, నల్లగొండ, నిజామాబాద్, 17వ తేదీ(గురువారం) గుంటూరు,
పశ్చిమగోదావరి, విజయనగరం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలలో
ఈ సమావేశాలు ఏర్పాటవుతాయని వివరించింది.