ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవి కుమార్ తాను
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించారు.ప్రజల అబీష్టం మేరకే
తాను కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి రావాలని భావిస్తున్నట్లు
ఆయన వెల్లడించారు. తాను ఈ ప్రకటన చేసినందుకే తన గ్రానైట్ క్వారీలపై
విజిలెన్స్ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.వై.ఎస్.రాజశేఖరరెడ్ డి
కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని ఆయన అన్నారు.కాగా తాను కొద్ది
రోజులుగా అద్దంకి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమైన
తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని రవి కుమార్ తెలిపారు.ఎమ్మెల్యేల
నుద్దేశించి రెండు కోట్ల సంతకాల గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.