ప్రజాదరణ నేపథ్యంలో ఈ కార్యక్రమం 10 వరకు పొడిగింపు
పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, సోమయాజులు వెల్లడి
సాధ్యమైనంత త్వరలో షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్:
వైఎస్సార్
కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా
చేపట్టిన ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమానికి అనూహ్య ప్రజాదరణ
లభిస్తోందని ఆ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, డీఏ సోమయాజులు తెలిపారు.
సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం
నాటికి కోటీ 24 లక్షల 36 వేల సంతకాలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రజాదరణ
నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు
పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలతో కలిసి సీబీఐ చేస్తున్న నీచమైన కుట్రలను
నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు.
త్వరలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్‌మెంట్ తీసుకొని, ప్రజల నుంచి
సేకరించిన సంతకాలను అందజేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా జగన్ సోదరి
షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సాధ్యమైనంత త్వరలో
ప్రారంభమవనున్నట్లు తెలిపారు. షర్మిల మోకాలికి జరిగిన ఆపరేషన్ కుట్లను
రెండురోజుల క్రితమే తీశారని, ప్రస్తుతం ఆమెను ఫిజియోథెరపిస్టులు
పర్యవేక్షిస్తున్నారన్నారు. డాక్టర్ల సలహాలు తీసుకొని, పాదయాత్ర
పునఃప్రారంభిస్తారని చెప్పారు.
పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, సోమయాజులు వెల్లడి
సాధ్యమైనంత త్వరలో షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: