కాంగ్రెస్‌పార్టీ
ప్రాంతీయ సమావేశం కోసం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని
ధ్వంసం చేయడం సరికాదని వైఎస్సార్సీపీ నేత పి.గౌతమ్‌రెడ్డి అన్నారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికార
దుర్వినియోగంతో నిబంధనలకు విరుద్ధంగా స్టేడియంలో పార్టీ ప్రాంతీయ సమావేశాలు
నిర్వహిస్తోందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు అధికారులు తొత్తులుగా
వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో క్రికెట్ క్రీడాకారుడు
సునీల్‌గవాస్కర్‌కు సన్మానం చేస్తామన్నా, రవిశంకర్ ఆధ్యాత్మిక కార్యమ్రాలు
నిర్వహిస్తామన్నా కుదరదన్న నేతలు ఇప్పుడు పార్టీ సమావేశాలు ఎలా
నిర్వహిస్తారని ప్రశ్నించారు. క్రీడలకు తప్ప ఇతర కార్యక్రమాలకు
స్టేడియాన్ని వాడకూడదన్నారు. సమావేశాల కోసం స్టేడియంలోని వాకర్స్ ట్రాక్‌ను
పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి తయారుచేసిన
స్టేడియం పాడవుతోందని, అందువల్ల పార్టీ సమావేశాలు వేరోచోట
నిర్వహించుకోవాలని సూచించారు. నిధులు లేకపోతే తమ పార్టీ తరఫున చందాలు
వసూలుచేసి ఇస్తామని, అంతేగానీ గ్రౌండ్‌ను పాడుచేయవద్దని కోరారు.