సమాజంలో
మహిళల సాధికారత కోసం కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు
వై.ఎస్.విజయమ్మ అన్నారు. యూనిక్ సాఫ్ట్రో కంపెనీ సి.ఇ.ఓ, ప్రభ ఛారిటబుల్
ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కుమారి డి.ప్రభ గురువారం విజయమ్మను ఆమె నివాసంలో
కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పేదలకు అండగా నిలబడాలని,
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని యువ సి.ఇ.ఓ అయిన ప్రభను
విజయమ్మ ప్రోత్సహించారు. ఈ భేటీలో ప్రభ తాను ట్రస్ట్ తరపున చేపడుతున్న
కార్యక్రమాలను విజయమ్మకు వివరించిచారు. ఆమెను విజయమ్మ అభినందిస్తూ
పార్టీలోకి ఆహ్వానించారు.