హెటిరో
యాజమాన్య వైఖరిని వైఎస్‌ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్
తీవ్రంగా ఖండించారు. విశాఖ హెటిరో డ్రగ్స్ పరిశ్రమలో శనివారం ప్రమాదం జరిగి
చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. ఆ
పరిశ్రమలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో
తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలన్నారు. మృతుల కుటుంబాలకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. హెటిరో డ్రగ్స్
సీ-బ్లాక్‌లో ప్రమాదం జరిగి ముగ్గురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.