తన
కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను
సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా
ఉన్న వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఎస్ అధికారి కేవీ
బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు 17 వరకు పొడిగించింది. రిమాండ్
ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిని
ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట
హాజరుపర్చారు. అలాగే చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న ఆడిటర్
విజయసాయిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డి,
విజయలక్ష్మీ ప్రసాద్, చంద్రమౌళి, కార్తీక్, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య,
మన్మోహన్‌సింగ్, శ్యామ్యూల్, నిమ్మగడ్డ ప్రకాష్‌లతోపాటు కంపెనీల
ప్రతినిధులు కోర్టు ఎదుట హాజరయ్యారు.