Thursday, 3 January 2013

[YSR ] ఓటర్ల నమోదులో అక్రమాలు: సోమయాజులు

సహకార సంఘాల ఓటర్ల నమోదులో సర్కార్‌ అక్రమాలకు పాల్పడుతున్నట్టు వైఎస్‌ఆర్‌ సీపీ సీజీసీ సభ్యులు సోమయాజులు ఆరోపించారు. పాత తేదీలతో ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సొంత జిల్లా చిత్తూరులో పరిస్థితి దారుణంగా ఉందని..అనర్హుల్నీ ఓటరుగా గుర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. సహకార సంఘాల నిర్వహణ అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని సోమయాజులు తెలిపారు.