వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరికాసేపట్లో హైకోర్టు
నిర్ణయం వెలువరచనుంది. ఎంపీగా ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత తనపై
ఉందని ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. సీబీఐ
న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తుందని.. సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా
చూపి సంవత్సరాల తరబడి జైల్లో పెడతారా ? అంటూ జగన్ తన పిటీషన్‌లో
ప్రశ్నించారు. రెండురోజుల క్రితం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు
నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.