Wednesday, 23 January 2013

[YSR ] సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్

సహకార సంఘాల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రవ్యాప్తంగా సహకార పరపతి సంఘాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాల వారిగా ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొదటి దశ ఎన్నికలు జనవరి 31, రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 4న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న జిల్లా సహకార బ్యాంక్‌ ఎన్నికలు, ఫిబ్రవరి 22న అప్కాబ్‌ ఎన్నికలు జరుపుతాయి. ఈ నెల 24 వరకూ నామినేషన్ల పర్వం కొనసాగనుంది.