[YSR ] జగన్ ని కలిసిన కుటుంబ సభ్యులు
చంచల్‌గూడ
జైల్లో వున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కుటుంబ
సభ్యులు శనివారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. వారు కొద్ది సేపు ఆయనతో
సమావేశమయ్యారు. జగన్‌ను కలిసిన వారిలో తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి
షర్మిల, ఆయన కుమార్తెలు ఉన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో గాయపడ్డ
షర్మిల చికిత్స అనంతరం జగన్‌ను కలవటం ఇదే తొలిసారి. ఆమె ఇంకా కోలుకోని
నేపథ్యంలో నడిచేందుకు స్టిక్ సాయం తీసుకుంటున్నారు.