Wednesday, 9 January 2013

[YSR ] హత్యారాజకీయాలకు బాబు ప్రోత్సాహం: తోపుదుర్తి


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ‘అనంత’లో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ విదేశాలకు వెళ్లి చదువుకుంటుంటే కేసులో ఇరికించారని టీడీపీ అధినేత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీరామ్‌ను కేసుల్లో ఇరికించడానికి పోలీసులు, వైఎస్సార్ పార్టీ నేతలు కుట్ర పన్నారని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసులను అనుకూలంగా మార్చుకునే స్థితిలో లేరన్నారు. చంద్ర శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రామగిరి పీఏసీఎస్ సీఈవో రవిచంద్ర ఆత్మహత్య బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.