Wednesday, 16 January 2013

[YSR ] సంతకాల సేకరణకు అపూర్వ స్పందన


'జగన్ కోసం...జనం సంతకం' కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు. మొత్తం కోటి తొంభై ఆరు లక్షల మంది సంతకాలు చేశారని ఆమె మంగళవారమిక్కడ చెప్పారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ దొరకడంతో సమయాభావం వలన కోటి 56 లక్షల సంతకాలనే రాష్ట్రపతికి సీడీల రూపంలో అందచేస్తున్నట్లు తెలిపారు. 

ప్రజల ఆశీస్సులతో జగన్‌మోహన్‌ రెడ్డి బయటకు వస్తారని విజయమ్మ అన్నారు. జగన్‌ గురించి మాట్లాడుతున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సంతకాల సేకరణకు అపూర్వ స్పందన వచ్చిందని విజయమ్మ తెలిపారు. చరిత్రలో ఎవరి కోసం ఇంతపెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరగలేదన్నారు. వైస్ కలలు కన్న సువర్ణయుగాన్ని జగన్ తప్పక తీసుకువస్తారని ఆమె అన్నారు.