ప్రజాకోర్టులో
జగన్‌ను నిర్దోషిగా తేల్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. జగన్ కోసం జనం సంతకం సీడీలతో
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటి అనంతరం రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన
మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్‌ది అక్రమ అరెస్టని మరోమారు సంతకాల
రూపంలో తమ భావాలను ప్రజలు వ్యక్తం చేశారు అని విజయమ్మ అన్నారు. 2 కోట్లకు
పైగా మా వద్దకు సంతకాలు చేరాయి అని వైఎస్ విజయమ్మ తెలిపారు. కోటి 56 లక్షల
సంతకాలను స్కాన్ చేసి రాష్ట్రపతికి నివేదించామన్నారు.
కేవలం 3 వారాల్లో సేకరించిన సంతకాలపై ప్రణబ్ ఆశ్చర్య వ్యక్తం చేశారని..
తాము ఇచ్చిన నోట్ ను ప్రధానికి పంపిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని
విజయమ్మ తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్, టీడీపీలు సీబీఐతో
కుమ్మక్కయ్యాయని, వాటి తీరును రాష్ట్రపతికి వివరించామని.. విచారణ పేరుతో 8
నెలలుగా జగన్‌ను అక్రమంగా నిర్బంధించారని వివరించామని విజయమ్మ మీడియాకు
తెలిపారు.