వైఎస్
జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 22వ తేదీకి
వాయిదా పడింది. సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణను వాయిదా
వేయాలని సీబీఐ కోర్టును కోరింది. దాంతో న్యాయస్థానం విచారణను వాయిదా
వేసింది. దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ
లిఖితపూర్వకంగా తెలియజేసిన 3 నెలల గడువు ఈ రోజుతో ముగిసింది.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం బెయిలుపై విచారణ మొదలుకాగా... సీనియర్ న్యాయవాది తమకు అందుబాటులో లేరని, కాబట్టి ఈ నెల 18వ తేదీకి గానీ, 21వ తేదీకి గానీ వాయిదా వేయాలని సీబీఐ కోరింది. దీనికి జగన్ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీనియర్ న్యాయవాదులు చాలామంది ఉంటారని, ఒకరు కాకుంటే మరొకరిని తెచ్చుకోవాలి తప్ప ఆ కారణంతో బెయిలు రాకుండా చేయాలనుకోవటం సరికాదని చెప్పారు. ఇది బెయిలును జాప్యం చేసే ఎత్తుగడే తప్ప మరొకటి కాదన్నారు. అయితే రేపటి నుంచి కోర్టుకు సంక్రాంతి సెలవులు కనుక అనంతరం ఈ కేసుపై విచారణ జరగనుంది.