
రాష్ట్ర
ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర
అసంతృప్తి ఉన్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
చెప్పారు. ఈ నెల 13వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన
గురువారం గౌరవాధ్యక్షులు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని ఆశీస్సులు
పొందారు. తమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు
చేపట్టలేకపోతున్నామనే ఆవేదన శాసనసభ్యుల్లో ఉందన్నారు. అవిశ్వాసతీర్మానం
సందర్భంగా తన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చినందువల్లనే
తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశానని... ఏడాది కాలంగా ఒక్కటీ
నెరవేర్చలేదని విమర్శించారు. ఒక కొత్త రేషన్‌కార్డు కూడా ఇప్పించుకోలేని
పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత వైఎస్ సంక్షేమ పథకాల
అమలు కూడా గాలికి వదలేశారని దుయ్యబట్టారు.