[YSR ] 1,52,00,000 ‘‘జగన్ కోసం జనం సంతకం’’
వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధించేందుకు
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐని ఉపయోగించుకొని చేస్తున్న నీచమైన
కుతంత్రాలకు నిరసనగా చేపట్టిన ‘‘జగన్ కోసం జనం సంతకం’’ కార్యక్రమానికి
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ
కార్యక్రమం గడువు గురువారం (జనవరి 10)తో ముగిసింది. ఇప్పటిదాకా 1.52 కోట్ల
సంతకాలు పూర్తయినట్లు పార్టీ కార్యాలయ సమన్వయకర్త పీఎన్‌వీ ప్రసాద్
తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి గురువారం నాటికి 1.02 కోట్ల సంతకాలు
అందినట్లు చెప్పారు. మిగతావి శుక్రవారం ఉదయానికి అందుతాయన్నారు. ప్రజల
నుంచి సేకరించిన సంతకాలన్నింటినీ రెండు మూడు రోజుల్లో స్కానింగ్ చేసి
సీడీలలో పొందుపరిచాలని పార్టీ ఆలోచిస్తోంది. సంతకాల హార్డ్‌కాపీలతోపాటు ఈ
సీడీలను కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేయనున్నారు. ఇందుకోసం
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని నేతలు భావిస్తున్నారు.