Wednesday, 16 January 2013

[YSR ] ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లాం: మేకపాటి


 వివాదాస్పద 26 జీ వోల్లో జగన్‌కు ప్రమేయం ఉన్నట్టు సీబీఐ ఆరోపిస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అయితే సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం నిబంధనల మేరకే జీవోలు జారీ అయ్యాయని తెలిపిందని ఆయన అన్నారు. జీవోలన్నీ సక్రమమే అయినప్పుడు క్విడ్ ప్రోకోకు అవకాశం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ వైఖరిని ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లి.. న్యాయం చేయాలని కోరామన్నారు. అన్ని అంశాలను పరిశీలిస్తానని ప్రణబ్ హామీ ఇచ్చారని ఎంపీ మేకపాటి తెలిపారు.