Wednesday, 9 January 2013

[YSR ] నేడు కర్నూలులో విజయమ్మ ధర్నా


 విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొననున్నారు. కర్నూలు పట్టణం బళ్లారి చౌరస్తాలోని ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటారని పార్టీ నేతలు తెలియజేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆమె ధర్నాలో పాల్గొంటారని వివరించారు.