Wednesday, 9 January 2013

[YSR ] సిఎం సభలో మహిళల నిరసన


తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న సభలో మహిళలు నిరసనకు దిగారు. వంద రూపాయలకే రేషన్‌ ఇస్తామన్న సీఎం ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నిత్యావసర వస్తువులు, గ్యాస్‌ ధరలు పెరగడంపైన, విద్యుత్‌ చార్జీల పెంపుపైన వారు మండిపడ్డారు. ఆరు గ్యాస్ సిలెండర్ల తరువాత ఏడో సిలెండర్ వెయ్యి రూపాయలు పెట్టి కొనాలంటే ఏలా బతకాలని ప్రశ్నించారు. మూడు వేల రూపాయలు వచ్చే జీతగాళ్లు వెయ్యి రూపాయలు గ్యాస్ సిలెండర్ కు, 500 రూపాయలు విద్యుత్ బిల్లుకు చెల్లిస్తే వారేం తింటారని అడిగారు. పెరిగిన చార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.