| |||
వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్ పై
హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా
వేసింది. భోజనవిరామం తర్వాత జగన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, సిబిఐ
తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ అశోక్ భాను తమ వాదనలు వినిపించారు.
ఒక్క సీసీ8 లోనే కాకుండా, అన్ని అంశాలకు సంబంధించి జగన్ ను రిమాండ్ లోకి తీసుకున్నారని నిరంజన్ కోర్టుకు తెలిపారు. కేవలం దాఖలుచేసిన ఛార్జిషీటుకు సంబంధించి మాత్రమే రిమాండ్ లోకి తీసుకోలేదన్నారు. వీలైనంత త్వరలో దర్యాప్తు పూర్తిచేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పిందని, అయితే దర్యాప్తు ముగింపునకు అంతం ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. ఎంతకాలం అంటే అంతకాలం జగన్ ను జైలులో ఉంచుతారా? అని అడిగారు. 90 రోజులకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టడీలో ఉంచకూడదని ఆయన వాదించారు.
దర్యాప్తు పూర్తిచేయడానికి సమయం పడుతుందని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. ఎంతకాలం పడుతుంది? ఎన్నేళ్లు పడుతుంది? అని సీబీఐపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు పూర్తిచేయడం కష్టంగా ఉందని సీబీఐ తెలిపింది. దర్యాప్తునకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందడంలేదని చెప్పింది. ఈ విషయాన్ని చెప్పడానికి తాము సంకోచించడంలేదని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.