Friday, 25 January 2013

[YSR ] కాంగ్రెస్ పార్టీకి మరో షాక్


 కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బందరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పేర్ని నాని గురువారం చంచల్‌గూడ జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. త్వరలోనే ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని సమాచారం. 

బందరు పోర్టు కోసం ఉద్యమం చేసిన పేర్ని నాని 2004, 2009 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పేర్ని నాని తండ్రి కృష్ణమూర్తి కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత. నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.