Wednesday, 2 January 2013

[YSR ] తప్పు చేసిన వారిని శిక్షించడంలో కూడా ఇంత జాప్యమా ?


ఢిల్లీ ఘటనపై మన్మోహన్, సోనియా వ్యాఖ్యలు సిగ్గుచేటని వైఎస్‌ఆర్ సీపీ అధికారిక ప్రతినిధి రోజా వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని శిక్షించడంలో కూడా ఇంత జాప్యమా అని రోజా ప్రశ్నించారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై కిరణ్, బొత్స వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి సబిత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ కరువైందని...హోంమంత్రిగా సబిత కొనసాగడం ఎంత వరకు సబబు అని రోజా అన్నారు. మహిళల సమస్యపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని...దేశంలో మహిళా నేతలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని ఆమె తెలిపారు. ఢిల్లీ ఘటన దురదృష్టకరమని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.