టీడీపీ
అవలంభిస్తున్న అవకాశ వాద రాజకీయాలకు నిరసనగా ఆ పార్టీని వీడుతున్నట్లు
చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.
చంచల్‌గూడ జైల్లో వున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిసి
మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్‌తో
చట్టాపట్టాలేసుకుని పనిచేయటం బాధ కలిగిస్తోందన్నారు. దివంగత నేత వైఎస్
రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ ఇబ్బందుల్లో ఉన్నందునే ఆయనకు
వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్‌ఆర్ సీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.