Friday, 25 January 2013

[YSR ] తాజా సర్వేలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ కూటమికి ఇబ్బందులు తప్పవని ఇండియా టుడే-నీల్సన్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే తేల్చింది. యూపీఏ కూటమికి వ్యతిరేక పవనాలు తప్పవని ఈ సర్వే పేర్కొంది. ప్రస్తుతం యూపీఏ మెజారిటీ సీట్లు గెలుచుకోవటం కష్టమని అభిప్రాయపడింది. తాజా ఇండియన్ టుడే-నీల్సన్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ కూటమి 152 నుంచి 162 సీట్లలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ సర్వేలో ఎన్డీఏ కూటమి సుమారు 198 నుంచి 208 సీట్లు గెలుచుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఇతర పార్టీలు 178 నుంచి 182 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొంది. ప్రధాని అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ కంటే మోడీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని సర్వే తెలిపింది.