Wednesday, 23 January 2013

[YSR ] వైఎస్సార్ పార్టీలోకి వలసలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చింతలపూడి మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ బొడ్డు వెంకటేశ్వరరావు, టీడీపీ నేత నాగేశ్వరరావు, పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు శుక్రవారం చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేశ్‌ నేతృత్వంలో వైఎస్‌ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. 

*మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మండలం నిడుగుర్తిలో వర్తకం జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో 1000 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

*తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో 100 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రౌతులపూడి మండలం ఎ.మల్లవరంలో 200మంది వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చారు.

*కృష్ణా జిల్లా పెడన మండంల కాకర్లమూడిలో ఉప్పల రాంప్రసాద్ నేతృత్వంలో 400 మంది వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.