[YSR ] మందేసి, చిందేసిన ‘తెలుగు’ తమ్ముళ్లు
నూతన
సంవత్సర వేడుకల్లో టీడీపీ కార్యకర్తలు మందేసి చిందేశారు. ఈ సంఘటన సోమవారం
అర్ధరాత్రి ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. కొత్త సంవత్సర
వేడుకలు వద్దని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన మాటను
గౌరవిస్తున్నట్లుగా సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనతో ఎన్‌టీఆర్
విగ్రం వరకు వెళ్లి, ఢిల్లీ గ్యాంగ్ రేప్ మృతురాలికి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేకు కటింగ్‌తో పాటు మందు, విందు,
రికార్డింగ్‌డాన్స్ ఉండటంతో పార్టీ చోటా నాయకులు, కార్యకర్తలు
పెద్దసంఖ్యలోనే హాజరయ్యారు. పార్టీలో పాల్గొన్న ఓ ప్రముఖ నేత దగ్గరి బంధువు
బాగా తాగి స్టేజీ మీదకు వెళ్లాడు. అక్కడ నాట్యం చేస్తున్న మహిళతో తాను
కూడా డాన్సు చేస్తానని పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. దీంతో ఒకరినొకరు
తోసుకుంటూ నానా దుర్భాషలాడుకుంటూ రికార్డింగ్ డాన్సర్‌తో చిందులు వేశారు.