సహకార
ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతల తీరును
నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చిత్తూరు జిల్లా
పీలేరులో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతల దాదాగిరిని అడ్డుకోవాల్సిందిపోయి
వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో
తిరుపతి- మదనపల్లె రహదారిపై వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు బైఠాయించారు.