కాంగ్రెస్ నేత, కామిరెడ్డిపల్లి సుధాకరరెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌కు జిల్లా కోర్టు బుధవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో శ్రీరామ్ లొంగిపోవాలని న్యాయమూర్తి సూచించారు. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌నుంచి బెయిల్ ఉత్తర్వులు పొంది విడుదల కావచ్చని చెప్పారు. అయితే ఈ కేసులో పోలీసులు విచారణకు పిలిచిన ప్రతిసారీ వారికి సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టరాదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారికి కూడా బెయిల్ మంజూరైనట్లు తెలిసింది.
Thursday, 10 January 2013
[YSR ] పోలీసుల ఎదుట లొంగిపోక తప్పని పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే