ఫ్యాక్షన్
అంతంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అని వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి
ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఫ్యాక్షన్ ను రూపుమాపాలనుకుంటే పరిటాల
కుటుంబాన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిటాల
వర్గీయుల వెబ్‌సైట్ ముఠా కక్షలు ప్రేరేపించేలా ఉందని ఆయన అన్నారు. ఆ
వెబ్‌సైట్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని తోపుదుర్తి అన్నారు.
ప్రత్యర్థులపైకి పరిటాల రవిని చంద్రబాబు ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు శ్రీరామ్‌కు నారా లోకేష్ మద్దతు ఇస్తున్నారని తోపుదుర్తి
ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు.