
వచ్చే
ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు సగం మంది
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి
రాజమోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారమిక్కడ వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్
కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి నియోజకవర్గ నేత రామిరెడ్డి
ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి కావలి రూరల్ మండలంలోని మత్స్యకార గ్రామాల్లో
‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. ‘సీట్లు ఖాళీ లేక టికెట్లు ఇవ్వడం కుదరకపోవడంతో అధికార
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆగిపోయారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉంటేనే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు
టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. అదే జగన్
జైలు బయటకివస్తే.. టీడీపీని మూసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు
భయపడుతున్నారు. ఆ కారణంతోనే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు’ అని చెప్పారు.
గతంలో
జారీ చేసిన జీవోలన్నీ సరైనవేనని ఇప్పుడు మంత్రుల కోసం రాష్ట్ర ప్రభుత్వం
చెబుతోందని.. అలాంటప్పుడు ఆ జీవోల పేరిట జగన్‌ను సీబీఐ అరెస్టు చేయడం
అక్రమమని అన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే అది వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
అందుకే జగన్ కోసం జనం సంతకం కార్యక్రమంలో స్వచ్ఛందంగా
పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్,
టీడీపీలకు డిపాజిట్లు దక్కవన్నారు.