Sunday, 13 January 2013

[YSR ] విజయమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. ప్రత్యేకించి రైతన్నలు, రైతు కూలీలకు మరింత మంచి జరగాలని ఆమె కోరుకుంటున్నారు. రైతన్నకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగ చేసే విధానాలకు జయం కలగాలని, శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రం వర్థిల్లాలని విజయమ్మ ఆకాంక్షిస్తున్నారు.