వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చంద్రబాబు
తప్పుబట్టడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తిరుపతి ఎమ్మెల్యే భూమన
కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే
కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి కుట్రపన్ని జగన్‌ను ప్రజలకు దూరం చేశాయని
ఆరోపించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో
పాల్గొని జగన్ నిర్దోషని తీర్పుచెబుతున్నారని అన్నారు.