వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో
ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర బుధవారం గద్వాల శివారులోని నోబెల్ స్కూల్ నుంచి
ప్రారంభం అవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం,
జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. సంగాల చెరువు, సంగాల క్రాస్
రోడ్, గోనుపాడు, ధరూర్, మన్నాపురం మీదుగా నెట్టెంపాడు ప్రాజెక ు్టకు
చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారన్నారు. షర్మిల మొత్తం 17.5 కి.మీ
యాత్ర చేపడతారని వారు వివరించారు.