వైఎస్‌ఆర్
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ కేకే
మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలపడుతుండడంతో టీఆర్ఎస్
నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పుడు
ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా
ఉన్నారన్నారు. వైఎస్సార్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవగాహన లేకుండా
మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణను అందరికంటే ఎక్కువగా వైఎస్సార్
అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలో 4 ప్రాజెక్టులను
తీసుకొచ్చింది ఆయనేనని తెలిపారు.