వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కేసులో సీబీఐ తీవ్ర జాప్యం
చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.
బెయిల్ రాకుండా సీబీఐ కాలయాపన చేస్తోందన్నారు. టీడీపీ - కాంగ్రెస్
చేతిలో సీబీఐ ఒక టూల్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. సాక్షులను సీబీఐ
బెదరిస్తోందని చెప్పారు. జగన్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు
సీబీఐ గడువు కోరడం కుట్రలో భాగమేనని అంబటి పేర్కొన్నారు.