కలుకుంట్ల
గ్రామస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల రచ్చబండ
నిర్వహించారు. ఆర్డీఎస్ నీటి సమస్యను గ్రామస్తులు షర్మిల వద్ద
ప్రస్థావించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దివంగ మహానేత డాక్టర్ వైఎస్
రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డీఎస్‌కు నిధులు కేటాయించారని
చెప్పారు. ఆయన మరణానంతరం ఆర్డీఎస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంత రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తం
చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం
లభిస్తుందని కలుకుంట్ల గ్రామస్తులకు షర్మిల భరోసా ఇచ్చారు.