వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల
చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం వెంకటాపురం స్టేజీ నుంచి
ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా
కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. వెంకటాపురం స్టేజీ నుంచి యాత్ర
ప్రారంభమై పర్దీపురం, ఉప్పల్ క్రాస్ రోడ్ మీదుగా ఐజ వరకు
కొనసాగుతుందన్నారు. ఐజలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల
మాట్లాడతారని, అనంతరం అక్కడి నుంచి బయలు దేరి 5.1 కిలోమీటర్ల తర్వాత రాత్రి
బస చేస్తారన్నారు. ఆదివారం మొత్తం 15 కి.మీ యాత్ర సాగుతుందని వారు
వివరించారు.