దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు
కేసీఆర్ వ్యాఖ్యాలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ పెట్టి 12 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో ఉన్న మీ ఎమ్మెల్యేలు
తెలంగాణలో ఏ ఒక్క ప్రాంతానికైనా టీఎంసీ నీళ్లు తెచ్చిన దాఖలు లేవని ఆయన
అన్నారు. కేటీఆర్‌కు లగడపాటి రాజగోపాల్, టీజే వెంకటేశ్‌లతో వ్యాపార
లావాదేవీలు లేవా?అని రెహ్మాన్ ప్రశ్నించారు