వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో
ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం అయిజ శివారు ప్రాంతం నుంచి
ప్రారంభిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా
కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు. అయిజ దాటిన తర్వాత 5 కిలోమీటర్ల
నుంచి యాత్ర ప్రారంభమై బింగిదొడ్డి, తాటికుంట్ల క్రాస్, శేషంపల్లి క్రాస్,
శేషంపల్లి క్రాస్‌రోడ్, మల్దకల్, శుద్దనూనెపల్లి మీదుగా బూడిదపాడుకు
చేరుకొని ఆ రాత్రికి గ్రామ సమీపంలో బస చేస్తారని పేర్కొన్నారు. సోమవారం
మొత్తం 16.2 కి.మీ. యాత్ర చేపడతారని వారు తెలిపారు.