పశ్చిమ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మహిళా నేతగా ఇదివరకు 250 కిలోమీటర్ల
మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారని, అయితే ‘మరో ప్రజాప్రస్థానం’
ద్వారా షర్మిల 500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు ఉన్న
రికార్డును బద్ధలుగొట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
ఎం.వి. మైసురారెడ్డి వెల్లడించారు. పాదయాత్రలో మైసురారెడ్డి సోమవారం
పాల్గొని షర్మిలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో
మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన పథకాలు ప్రజలను బాగా
ఆకర్షించాయని, దీంతో ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన యాత్రకు గ్రామగ్రామనా
అఖండస్వాగతం లభిస్తోందని తెలిపారు.