మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల అలంపూర్ మండలం పుళ్లూరు వద్ద గురువారం
ఉదయంమహబూబ్‌నగర్‌లో ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది
ప్రజలతో ఘన స్వాగతం పలుకుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్
ఎడ్మ కిష్టారెడ్డి బుధవారం వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖరరెడ్డికి తెలంగాణలోవిపరీతమైన అభిమానం ఉందని ఆయన ఈ సందర్భంగా
తెలిపారు.