వైఎస్‌ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల
చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం పాణ్యం నియోజకవర్గంలోకి
ప్రవేశించనుంది. కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంలో సాగుతున్న పాదయాత్ర
మంగళవారం మధ్యాహ్న భోజన విరామం తరువాత పాణ్యం పరిధిలోని సల్కాపురానికి
చేరుకుంటుంది. సోమవారం రాత్రి బస చేసిన పెంచికలపాడు శివారు నుంచి మంగళవారం
ఉదయం షర్మిల కాలినడకన బయలుదేరుతారు. పెంచికల పాడు, నాగులాపురం,సల్కాపురం,
పెదపాడు ద్వారా కర్నూలు శివార్లలోని సెయింట్ క్లార్క్ స్కూల్ వరకు మొత్తం
15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. స్కూల్ ఆవరణలో షర్మిల రాత్రి బస
చేస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా
కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.