మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నవంబర్ 22 తేదిన వైఎస్ఆర్ సీపీ
గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన
రెడ్డిని ఉమ్మారెడ్డి కలువనున్ నారు. నవంబర్ 24 తేదిన పొన్నూరులో జరిగే భారీ బహిరంగ సభలో విజయమ్మ సమక్షంలో ఉమ్మారెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు సమాచారం. ఉమ్మారెడ్డి పార్టీని వీడటం తెలుగుదేశం పార్టీ నేతల్లో తీవ్ర కలవరం మొదలైనట్టు తెలుస్తోంది.