ఎమ్మెల్సీ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావుకు మాతృవియోగం కలిగింది.
శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కొద్దిరోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న
భూదేవమ్మ బుధవారం మరణించారు. భూదేవమ్మ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సంతాపం తెలిపింది. కాగా ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిమ్స్ కు వెళ్లి భూదేవమ్మను పరామర్శించారు.