Wednesday, 17 October 2012

[YSR Congress Party] పార్టీ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్ సైట్ ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో www.ysrcongress.com ను ఆమె ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ డాట్ కామ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబ్ సైట్ లో పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు. 

తెలుగులో ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్‌ ద్వారా 'ఆన్‌లైన్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ'లో చేరవచ్చు. రాష్ట్రంలో కొత్త పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఈ వెబ్‌సైట్‌లో సమగ్ర కథనాన్ని పొందుపరించారు. పార్టీకి, ప్రజలకు అనుసంధానంగా ఈ వెబ్‌ సైట్‌ నిలుస్తుందని వైఎస్‌ విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు ఈ సైట్‌ ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్ రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాజీరెడ్డి గోవర్థన్, చల్లా మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.