Saturday, 20 October 2012

[YSR Congress Party] అనంతలో 23నుంచి షర్మిల పాదయాత్ర

అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి ఆమె మరో ప్రజాప్రస్థానం యాత్ర నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని పూర్తి చేసుకున్న అనంతరం దాడితోట వద్ద వైఎస్ షర్మిల అనంతలోకి ప్రవేశిస్తారు. 

సుమారు 14 రోజుల పాటు ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. మొత్తం 75 గ్రామాల.. పట్టణాల మీదుగా షర్మిల పాదయాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. షర్మిల పాదయాత్ర కోసం అనంత జనం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని.. కనీవినీఎరుగని రీతిలో అనంతపురంలో పాదయాత్ర జరగనుందని వైఎస్‌ఆర్‌ సిపి నేత శంకర నారాయణ చెప్పారు.