అనంతపురం:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల
జ్వరంతో బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్లర్లు ఆమెకు
సూచించారు. అయినప్పటికీ ఆమె పాదయాత్ర కొనసాగిస్తానన్నారు. ఈ రోజు షర్మిల
పాదయాత్రను చిగిచర్ల వరకు కుదించినట్లు పార్టీ నేత తలశిల రఘురాం చెప్పారు.